
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలో ఒక వ్యక్తి తన భూమిలో అభివృద్ధి పనుల కోసం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండు చేసి అందులో భాగంగా “లక్ష రూపాయల” లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. సైబరాబాద్ కమిషనర్ రేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆకుల వెంకటేశం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అంతేగాక ఇంతకుముందు ఇదే ఇన్స్పెక్టర్ ఇదే వ్యక్తిపై రౌడీ షీట్ నమోదు కాకుండా ఉండటం కోసం “రెండు లక్షల రూపాయలు” లంచంగా తీసుకున్నాడు. అలాగే జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ & మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ కోసం ప్రభుత్వం సేకరించిన భూమికి సంబంధించిన చెక్కును ప్రాసెస్ చేయడానికి ప్రతిఫలంగా ఒక రైతు నుంచి “డెబ్భై వేల రూపాయలు” లంచం తీసుకుంటుండగా సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల తాసిల్ దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేసే సంగేమ్ దుర్గయ్య కూడా లంచం తీసుకుంటూ అనీషా అధికారులకు పట్టుబడ్డారు. దుర్గయ్య పై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఒకేరోజు హైదరాబాదు ప్రాంతంలో ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టు పడడం సంచలనంగా మారింది.


