
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జ్ఞాన కేంద్రం ఒక పుస్తక బండాగారంగా ఉంటుందని, విజ్ఞాన కేంద్రంగా పనిచేస్తుందని మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోoటాల బుచ్చయ్య పేర్కొన్నారు. మున్సిపల్ సమీపంలోని ఈటెల రాజేందర్ కాంప్లెక్స్ లో జ్ఞాన కేంద్రం గ్రంథాలయాన్ని మానవ వికాస వేదిక కేంద్ర కమిటీ అధ్యక్షులు బి సాంబశివరావు, సమాలోచన పత్రిక ఎడిటర్ డి హనుమంతరావులతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలతో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది కుటుంబాలకు సమాజానికి ప్రయోజకులుగా ఎదిగారన్నారు. నిరుపేద యువతి యువకులు నాన్న కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించి గొప్పగా ఎదగాలన్నారు. నాన్న కేంద్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టు మొదలుకొని ప్రతి విద్యార్థి అవసరమైన పుస్తకాలను, దినపత్రికలను ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి రామస్వామి, మోహన్, వెంకటేష్, రాజనర్సు, స్వామి, భోగం రమేష్, వెంకన్న, దయాకర్, శ్యామ్, సదయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

