
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: అరోపణలు కాదు సాక్ష్యాలు ఏవీ కౌశిక్ రెడ్డి?. అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డినీ నిలదీశారు. మంగళవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం ఆరోపణలతో కాలం వెళ్ళబుచ్చాడే కానీ మంత్రి అవినీతికి పాల్పడ్డాడు అని ఆధారాలు చూపించలేకపోయాడని, కానీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని ఆదారాలతో మాట నిలబెట్టుకున్నట్లు ప్రణవ్ బాబు తెలిపారు. చేల్పూర్ హనుమాన్ గుడి వద్ద ప్రమాణం చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేకనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాకుండా పారిపోయాడన్నారు. ఓవర్ లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదనీ, అబద్ధాలు ఆడడంలో రాష్ట్ర పరిధి దాటాడనీ కౌశిక్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఇకపై హుజురాబాద్ లో నిన్ను ఎమ్మెల్యేగా గుర్తించమని ప్రణవ్ స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి ఒక జోకర్, బ్రోకర్ అని చెప్పారు. ఏమ్మేల్యేగా గెలిచి ఆరు నెలలైనా ఒక్క మంచి పని హుజురాబాద్ కు చేశారా? అని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరుతో తమని మోసం చేశాడని బాధితులు స్పష్టమైన ఆధారాలతో చెల్పూర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చిన కూడా తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఆసత్యమైన ఆరోపణలు మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని ప్రణవ్ బాబు అన్నారు. కౌశిక్ రెడ్డి విసిరిన సవాలుకు తాము సిద్ధమని ప్రకటించిన తర్వాత దాంట్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సవాల్ విసిరగా దానికి కౌశిక్ రెడ్డి వస్తానని అన్నారు, కానీ తన చిత్తశుద్ధి కౌశిక్ రెడ్డి మనస్సాక్షికి తెలుసునని కౌశిక్ రెడ్డి చెప్పినవన్నీ అభధ్ధాలు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తన దగ్గర ఆధారాలతో ఆరోపణలు చేయాలే గాని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దని హితవు పలికారు. స్థాయికి మించి మంత్రిపై అరోపణలు చేసే కౌశిక్ రెడ్డి ఆధారాలు చూపాలని సూచించారు. తాము విసిరిన సవాల్ కు కట్టుబడి తాము ఆధారాలతో సహా మీడియా ముందు ప్రవేశ పెట్టామని స్వయంగా ఎవరైతే డబ్బులు ఎమ్మెల్యేకు ఇచ్చారో వారే చెల్పూర్ లోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో తడి బట్టలతో కొబ్బరికాయ కొట్టారని, మీడియా సమక్షంలో కౌశిక్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని చెప్పారని, కానీ ఎమ్మెల్యే దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపెట్టమని అడిగితే ఓవర్ లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేసి పారిపోయాడని అన్నారు. దేవుడి పై ఒట్టేసి అబ్దద్ధాలు ఆడడం సిగ్గు చేటనీ, ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మంచిది కాదని, ఎన్నికల సమయంలో కుటుంబాన్ని అడ్డు పెట్టాడని, హుజురాబాద్ లో ఉనికి కాపాడుకోవాలని దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. ఇకపై హుజూరాబాద్ అభివృధ్ధి పట్ల దృష్టి సారిస్తామని, చిల్లర ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీలో లేదని, దిగజారుడు బ్లాక్ మెయిల్ చేయడంలో కౌశిక్ రెడ్డి చరిత్ర సృష్టించాడని అన్నారు. ఆధారాలు లేకుండా నేటి నుండి మంత్రిపై అరోపణలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలైనా హుజురాబాద్ కు ఒక మంచి పని కూడా చేయలేదని రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి ఒక జోకర్ అని అన్నారు. తాము ఆధారాలు ఉంటేనే మాట్లాడుతామని ప్రణవ్ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి పొనగటి మల్లయ్య, నేరెళ్ల మహేందర్ గౌడ్, సారంగపాణి, వేముల పుష్పలత, రమేష్, శ్రీనివాస్, రాజయ్య, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







