
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ అధికారులపై హుజురాబాద్ పట్టణానికి చెందిన టేకుల శ్రావణ్ గురువారం లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ పట్టణంతోపాటు మండల పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పలు అక్రమ నిర్మాణాలపై జిల్లా మరియు మండల పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ మరియు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయమై పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ గడిచిన నాలుగు నెలలుగా పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. వారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదని, సదురు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్షం వహిస్తున్న జిల్లా పంచాయతీ అధికారులపై ఉన్నతాధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.







