
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల నుండి తరలివచ్చే లక్షలాదిమంది మాదిగల ఆధ్వర్యంలో మాదిగ కవాత్ ను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం హుజూరాబాద్ ఎమ్మార్పీఎస్- ఎంఎస్పి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రంమాదిగా మాట్లాడుతూ వరంగల్ నగరంలో జూలై 7న కనివిని ఎరుగని రీతిలో లక్షలాది మంది మాదిగలతో భారీ ఎత్తున మాదిగల కవాతును నిర్వహిస్తున్నామని, దీనిలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు పాల్గొంటారని తెలిపారు. కావున నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ పల్లెల నుండి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, ఎమ్మార్పీఎస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు మారేపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు రేణిగుంట్ల సాగర్, మొలుగూరి ప్రభాకర్, ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల మధునయ్య, ఎమ్మార్పీఎస్ హుజురాబాద్ మండల అధ్యక్షుడు రొంటాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
