
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో కాట్రపల్లి గ్రామంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన దివస్ ను పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చెట్టు నాటి మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నాటి నిరంకుశ కాంగ్రేస్ పాలనను అంత మొందించడానకి జన సంఘ్ ను స్థాపించి నేటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యాన భారతదేశం అతర్జాతీయ స్థాయికి ఎదగడనికి నాంది పలికాడన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నాను, ఇందులో భాగంగా ఈరోజు కాట్రపల్లి గ్రామంలోని రెండు బుతులలో 100 మొక్కలను నాటా మన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాముల కుమార్, జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల శ్యామ్, మండల ప్రధాన కార్యదర్శి మోడెపు వినయ్, బూత్ అధ్యక్షులు తళ్లపల్లి అనిల్, ముప్పు కోటి, గ్రామ కార్యకర్తలు పెరుమల కోటి, శ్యామ్, రఘు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.






