
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ కంద కట్ల రమేష్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం కళాశాల ప్రిన్సిపాల్ డా.పి ఇందిరాదేవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.పి ఇందిరాదేవి మాట్లాడుతూ రమేష్ 37 సంవత్సరాలుగా లైబ్రేరియన్ గా విశేషమైన సేవలు అందజేసి అందరి మన్ననలు పొందారనీ అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పి లక్ష్మీనరసింహ మూర్తి సభానిర్వహణ చేస్తూ రమేష్ సేవలను కొనియాడారు.
ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డా.పి దినకర్, అకడమిక్ కో ఆర్డినేటర్ డా. జి శ్రీనివాస్, ఉపన్యాసకులు ఉదయశ్రీ, గొడిశాల పరమేష్, శ్యామల, రాజకుమార్ లైబ్రేరియన్ రమేష్ సేవలను ప్రశంసించారు. ముఖ్య అతిథిగా కె డిసి ప్రిన్సిపాల్ డా. జి రాజిరెడ్డి, విశిష్ట అతిథిగా తెలంగాణ ఉపన్యాసక సంఘం టిజిసిజిటిఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డా. కె సురేందర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ నిర్మల, విశ్రాంత గ్రంథ పాలకులు సత్యనారాయణరావు,
రమేష్ సేవలను కొనియాడారు. రమేష్ కుమారుడు దిలీప్, అల్లుడు నవీన్ కుమార్, సోదరుడు రవీందర్ సభలో రమేష్ తో గల తమ అనుబంధం, జీవితానుభవాలను సభా ముఖంగా పంచుకున్నారు.
కళాశాల తెలుగు సహాయాచార్యులు, సాంస్కృతిక సమన్వయ కర్త శ్రీ ఎస్ మధు సన్మాన పత్రం సమర్పిస్తూ రమేష్ గ్రంథపాలకుడిగా, కళాశాల గ్రంథాలయాన్ని దేవాలయంలా తీర్చి దిద్దారనీ విద్యార్దులలో పుస్తక పఠన ఆసక్తిని పెంపొందించి దానిని
ఒక ఉన్నతమమైన అభిరుచిగా మార్చుకోవడానికి దోహద పడ్డారనీ, ఆయన కళాశాలలో మన టీవీ ఇన్చార్జిగాను, స్టాఫ్ సెక్రటరీ గాను పనిచేసి కళాశాలలో అందరి మన్ననలు పొందారనీ రమేష్ జీవిత విశేషాలను వర్ణిస్తూ సన్మానపత్రాన్ని సమర్పించారు. తదనంతరం కళాశాల సిబ్బంది రమేష్ దంపతులకు పుష్పగుచ్చం, శాలువా, ఙ్ఞాపిక, సన్మాన పత్రం తోపాటు ప్రత్యేక బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత రమేష్ 37సం.ల తన ఉద్యోగ జీవితానుభవాలను, కళాశాలతో గల అనుబంధాన్ని సభాముఖంగా పంచుకున్నారు. సభా నిర్వాహకులుగా పి.లక్ష్మి నరసింహమూర్తి, వ్యాఖ్యాతగా డా. పి.దినకర్ సభను రంజింప చేశారు. వందన సమర్పణ డా. జి.శ్రీనివాస్ చేశారు.
ఉపన్యాసకులు మధు, ఉదయశ్రీ, గొడిశాల పరమేశ్, చారి సమ్మయ్య, హరిప్రసాద్, రాజకుమార్, శ్యామలదేవి, స్వప్న, స్వరూప, బోధనేతర సిబ్బంది రాజ్ కుమార్, శ్రీలత, స్పందన మరియు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
