
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు, పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు, సీనియర్ జర్నలిస్ట్ పత్తి విష్ణువర్ధన్ రెడ్డి(44) నిన్న గుండేనొప్పితో బాధపడుతు అకాల మరణం చెందింది విధితమే. అయితే అతనికి భార్య, కుమారుడు ఉండగా తన అన్న పిసిసి సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి తన తమ్ముడికి అన్ని తానై తలకొరివి పెట్టి తొడబుట్టిన రుణం తీర్చుకున్నారు. ఈ అంత్యక్రియలకు పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన సీనియర్ జర్నలిస్టు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతని అకాల మరణం పట్ల చింతిస్తూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సనల్ డి రాజేశ్వరరావు, గంధేరాధికా శ్రీనివాస్, హుజురాబాద్ సింగిల్విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కన్యవేనా శ్రీనివాస్ యాదవ్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, నాయకులు గూడూరు స్వామి రెడ్డి, నేరెళ్ల మహేందర్ గౌడ్, సోల్లు బాబు, దేశిని కోటి, మిడిదోడ్డి రాజు, యండి అఫ్సర్, గంట కిరణ్ రెడ్డి, నరేడ్ల వినోద్ రెడ్డి, సామల రాజారెడ్డి, సందమల్ల బాబు, దుబాసి బాబు, మిడిదొడ్డి శ్రీనివాస్, మహిళా కార్యకర్తలు సొల్లు సునీత, సుశీల, లావణ్య, లక్మి, రాధ, తిరుమల, కరిమా, రిబ్కా తదితరులు పాల్గొన్నారు. కాగా జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతిని సంతాపం చేశారు.




పత్తి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కన్నిటి వీడ్కోలు సమర్పించిన హుజురాబాద్ నియోజకవర్గ హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
నిన్నా అకాస్మాత్తుగా అకాల మరణం చెందిన పాత్రికేయులు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి గారికి నివాళులు అర్పించిన హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు…వారి మృతి చాలా బాధాకరం అని పేర్కొన్నడం జరిగింది.. విష్ణువర్ధన్ రెడ్డి గారి సోదరుడు పిసిసి సభ్యులు పత్తి క్రిష్ణారెడ్డి గారిని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది..ఈ