
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హజురాబాద్: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే ఎంతో చక్కగా చదువుకొని భవిష్యత్తును బంగారమైన చేసుకోవచ్చని హుజురాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయి శ్రీ పిలుపునిచ్చారు. శనివారం హుజురాబాద్ లోని కాకతీయ జూనియర్ కళాశాలలో ‘మాదక ద్రవ్యాల ప్రబావం-విద్యార్ధులు’ అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి పద్మ సాయి శ్రీ మట్లాడుతూ మత్తు పదార్థాలు జీవితాలను దుర్బలం చేస్తాయని వాటికి విద్యార్థులు యువత దూరంగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించగలుగుతారన్నారు. ఒక్కసారి మత్తు పదార్థాలకు అలవాటు పడితే అవి జీవితాంతం వెంటాడుతూ జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు. పలువురు విద్యార్థులకు ఆమె అమల్యమైన సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మట్టేల తిరుపతి, లోక్ అదాలత్ సభ్యులు యతిపతి అరుణ్ కుమార్, కమని సమ్మయ్య, న్యాయవాదులు చౌడమల్ల భాను కిరణ్, ఐలయ్య, హుజరాబాద్ ఎస్సై సాంబయ్య, కోర్టు సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, కరస్పాండెంట్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

