
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్టూన్ వర్క్ షాప్ లో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ కి చెందిన దాదాపు 70 మంది కార్టూనిస్టులకు స్పాట్ కార్టూన్ డ్రాయింగ్ కాంటెస్ట్ నిర్వహించారు. “వర్షాకాలంలో సిటీ పరిస్థితులు” అనే అంశంపై నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలలో హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ కొండ రవిప్రసాద్ థర్డ్ ప్రైజ్ సాధించినట్లు తెలిపారు. కాగా ప్రముఖ కార్టూనిస్టు సుభాని డక్కన్ క్రానికల్, ప్రముఖ కార్టూనిస్టు మృత్యుంజయ నమస్తే తెలంగాణ మరియు ప్రముఖ కార్టూనిస్టు నర్సింగము చేతుల మీదుగా నగదు బహుమతి అందుకున్నారు. లెజెండ్ కార్టూనిస్టుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కొండ రవి ప్రసాద్ తెలిపారు.

