
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్షను విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో తెలిపారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టింది విధితమే. ఆయన దీక్ష చేపట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీల నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు ఆయనకు మద్దతు పలికి ఆందోళన మద్దతు తెలిపింది తెలిసిందే!
