
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: TGSRTC ఉద్యోగులకు పిఆర్సి జీతాలు పెరిగినందువల్ల డిపార్ట్మెంట్ పై అధిక భారము పడిందనీ ఆ అధిక భారాన్ని ఎలా తగ్గించుకోవాలో RTC MD V&C సజ్జనార్ ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారనీ అందులో భాగంగానే లక్షే లక్ష్యం కార్యక్రమం చేపట్టారనీ ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం హుజూరాబాద్ బస్టాండులో కళాకారులచే’లక్షే లక్ష్యం కార్యక్రమం’ నిర్వహించారు. దీనిని ఉగాది 2024 నుండి ఉగాది 2025 వరకు అనగా ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ప్రతి డిపోకు ఒక లక్ష రూపాయలు అదనంగా తేవాలని చెప్పాగా వారి ఆదేశానుసారము RM&DY.RM రోజుకి లక్ష రూపాయలు అదనంగా ఎలా సంపాదించాలి అనే ఆలోచనతో RTC ఉద్యోగులను ఒక టీం గా ఏర్పాటు చేసి టీంకు ఇన్చార్జిగా కరీంనగర్-2 STI ఎం కమల ను నియమించారన్నారు. వారి సూచనల మేరకు కండక్టర్లు డ్రైవర్లు ప్రతిరోజు వారు ఏ విధంగా డ్యూటీ చేస్తే లక్ష రూపాయలు అదనంగా తేవచ్చు అని పాట రూపంలో పొందుపరిచి టీం వారందరూ ట్రైనింగ్ అయి వారి ఆదేశానుసారం ప్రతి డిపోకు వెళ్లి కండక్టర్, డ్రైవర్లు సమయపాలన పాటిస్తూ లక్ష రూపాయలు ఏ విధంగా సంపాదించాలనే దానిపై చైతన్యపరచడం జరుగుతుందన్నారు. ఖాళీ సీటు వలన కలిగే నష్టము, ప్రతి స్టేజిలోనూ ప్రయాణికులను తీసుకునే విధానాన్ని, ట్రిప్పుల వారీగా EPKతెచ్చే విధానము డిపో టీం అందరి సహాయ సహకారం వల్ల కలిగే లాభాలు మరియు ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫుట్ బోర్డు ప్రయాణం వలన కలిగే నష్టము, విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకునే విధానము వివరించడం జరుగుతుందన్నారు. అలాగే ఆర్టీసీ కల్పించిన రాయితీలు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం సుఖమయము, ప్రైవేటు వాహన ప్రయాణం నష్టము అని ఆటపాట ద్వారా కళాబృందం వారితో ప్రతి డిపోకు వెళ్లి తెలియజేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గురువారం రోజున హుజురాబాద్ డిపోలో మరియు బస్టాండ్ లో ప్రదర్శన నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జి డిపో మేనేజర్ CH. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా దీనిలో STI ఎల్ సారయ్య, Ti2. వివిఆర్ రెడ్డి, డిపో సిబ్బంది, డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు.








