–నీట్ పరీక్ష మరల నిర్వహించాలి .!
-పలు విద్యార్థి సంఘాల డిమాండ్!
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: NEET మరియు NET పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా హుజురాబాద్ మరియు, జమ్మికుంట పట్టణాలతోపాటు మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించగా విజయవంతమైనట్లు పలు విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా NSUI జిల్లా ఉపాధ్యక్షులు MD ఇమ్రాన్ ,AISF కరీంనగర్ జిల్లా అద్యక్షులు రామారపు వెంకటేష్, సహాయ కార్యదర్శి కేశబోయిన రాము, SFI జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్,, జిల్లా కార్యదర్శి అభిలాష్, గాలిబ్ నరేష్, PDSU జిల్లా కోశాధికారి కెంసరపు రవితేజ మాట్లాడుతూ..NEET మరియు NET పరీక్ష పేపర్ల లికేజ్ వలన నష్టపోయి ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు పూర్తి స్థాయి భరోసా కల్పించడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాసిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వామే బాధ్యత వహించాలని, పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. పేపర్ లీకేజీ వలన నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎన్.టిఏను రద్దు చేయాలని, పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు, నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో NSUI కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇమ్రాన్ NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి పల్నాటి అభిలాష్ NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, NSUI టౌన్ ప్రెసిడెంట్ వంశీ, AISF కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ , AISF కరీంనగర్ జిల్లా కార్యదర్శి రత్నాకర్, SFI కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు అభిలాష్, PDSU హుజురాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వంశీ, సోహెల్, సోను ,సందీప్, శివ, రాజేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే
నీట్ అభ్యర్థులకు న్యాయం జరగాలి
-టీవైజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మోరె గణేష్
స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, జూలై 4:
నీట్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పలు రాజకీయ పార్టీలు, ఐక్య విద్యార్థి సంఘాలు ఇచ్చిన కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో కిట్స్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థలను తెలంగాణ యువజన సమితి, తెలంగాణ విద్యార్థి జన సమితి నాయకులు బంద్ నిర్వహించారు. టీవైజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మోరె గణేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ తీరని నష్టం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రానున్న కాలం ఐక్య ఉద్యమాల ద్వారా తమ శక్తిని చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల శ్రీనివాస్, దాసరపు శివ ,స్వామి, గాజుల శ్యామ్, రౌతు నవీన్, దాసారపు హర్ష, యమునూరు విన్ను తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్ బి బంద్ విజయవంతం….
–ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి–కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వగా జిల్లావ్యాప్తంగా విజయవంతమైందన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమం విజయవంతమైంది ఈ సందర్భంగా హుజురాబాద్ బందులో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో విద్యారంగం పూర్తిగా వివక్షకు గురైందని విధ్యారంగా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా 7100 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరియు నీటి పరీక్షలు రద్దుచేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడిని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్నా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవతక అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని, సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకులాలలో స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ సొంత భవనాలు నిర్మించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ నాయకులు కుక్కమూడి రాజేష్, కొండ్ర నగేష్, కొండ్ర వినయ్, పిట్టల సాయి తదితరులు పాల్గొన్నారు.