
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డ్ (NQAS)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిందని జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి తెలిపారు. గురువారం ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తో పాటు వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ ను కలిశారు. ఈ మేరకు అందుకున్న అవార్డును కలెక్టర్ కు అందజేశారు. 95 శాతం అచీవ్మెంట్ సాధించినందుకు ఏరియా హాస్పిటల్ కు అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. భారతదేశంలోనే టాప్ 3లో నిలవడం కరీంనగర్ కు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుజాత, ఏరియా ఆసుపత్రి సూపర్టిండెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ ఎం ఓ సుధాకర్ రావు, వైద్య విధాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు.






