
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజరాబాద్ మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధి వరంగల్ రోడ్డులో గల పలు అక్రమ కట్టడాలపై యువజన నాయకుడు టేకుల శ్రావణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు గురువారం పెద్దపాపయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో హుజురాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్
విచారణ జరిపించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు టేకుల శ్రావణ్ ఫిర్యాదును మరియు ఆయన వాంగ్మూలాన్ని సాక్షుల సమక్షంలో విచారణ చేయడం జరిగిందాని విచారణలో భాగంగా అవి అక్రమ కట్టడాలు అని నిగ్గు తేల్చే క్రమంలో ఫిర్యాదుదారుడుపై పలు అక్రమ కట్టడాలను నిర్మించే వ్యక్తులు ఫిర్యాదుదారులపై దుర్భాషలాడి బెదిరింపులకు గురిచేస్తూ విచారణను తప్పుదారి పట్టించే క్రమంలో అధికారులు జోక్యం చేసుకొని ఫిర్యాదు దారుడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలో వరంగల్ రోడ్డులో యదేచ్ఛగా విచ్చలవిడిగా అక్రమ కట్టడాలుగా తేలడంతో డిఎల్ పిఓ, మండల పంచాయతీ అధికారి మరియు పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణ రిపోర్టును జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారికి పంపిస్తామని తదుపరి విచారణకు సంబంధించిన విషయాలు ఉన్నతాధికారులకు వెల్లడిస్తారని డిఎల్పిఓ తెలిపారు.







