
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఖాజీపేట నుంచి మంచిర్యాలవైపు వెళ్లే దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు జమ్మికుంట రైల్వేస్టేషన్ లోని 1వ నెంబర్ ప్లాట్ ఫాం నుంచి రైలు కదులుతున్న సమయంలో జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్ (50) శుక్రవారం మధ్యాహ్నం రైలు నుంచి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో గమనించిన రైల్వే స్టేషన్ మాస్టర్ 108 వాహనంకు సమాచారం ఇవ్వగా వారు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.






