
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 10, 11, 12న వ్యవసాయ డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్ ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 2 ఏళ్ల వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సకాలంలో హాజరై కౌన్సిలింగ్ను సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు.
