
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినము సందర్భంగా స్థానిక హుజురాబాద్ బస్టాండ్ మరియు మార్కెట్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తుర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, పట్టణ ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, అంకతి వాసు, యాళ్ల సంజీవరెడ్డి, శక్తి కేంద్ర ఇన్చార్జి కొలిపాక వెంకటేష్, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, భూత్ అధ్యక్షులు క్యాస వెంకటేష్, సదయ్య, అయిత సందీప్, సమ్మయ్య యాట రాజేష్, పర్థం అనిల్, విజయ్, రాకేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







