
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి పి లక్మి నరసింహమూర్తి కి డాక్టరేట్ పొందిన సందర్భంగా శుక్రవారం అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరసింహమూర్తికి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. దీంతో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ప్ర్రొఫెసర్ డా.పి రాజేందర్ పర్యవేక్షణలో “కస్టమర్ పర్ సెప్షన్ టువర్డ్స్ డిజిటల్ బ్యాంకింగ్ ఏ సెలక్ట్ స్టడీ ” అనే అంశంపై లక్ష్మీనరసింహమూర్తి పరిశోధన చేసి గురువారం డాక్టరేట్ పొందారన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఘనంగా అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. పి ఇందిరాదేవి మరియు బోధన, బోధనేతర సిబ్బంది డా.లక్ష్మి నరసింహమూర్తిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.ఇందిరాదేవి మాట్లాడుతూ మూర్తి డాక్టరేట్ సాధించడం కళాశాలకు కూడా గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కో ఆర్డినేటర్ డా.పి దినకర్, అకడమిక్ కోఆర్డినేటర్ డా.జి శ్రీనివాస్, ఉపన్యాసకులు ఎస్ మధు, గొడిశాల పరమేశ్, చారి, శ్యామలాదేవి, హరిప్రసాద్, సమ్మయ్య, స్వరూప, డా.స్వప్న బోధనేతర సిబ్బంది రాజ్ కుమార్, రమేశ్, శ్రీలత, స్పందన మరియు విద్యార్థినీ విద్యార్థులు డా.లక్ష్మీనరసింహమూర్తిని అభినందించారు.
