
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: “ఉద్యమ గానకోకిల” పురస్కారాన్ని సీనియర్ కళాకారులు హుజురాబాద్ కు చెందిన వడ్లకొండ అనిల్ కుమార్, జమ్మికుంటకు చెందిన రామంచ భరత్ లను శుక్రవారం అందించి ఘనంగా సన్మానించారు. ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్, సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ లు ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ ఉద్యమ సంస్థ ఆవిర్భావం సందర్భంగా వారికి గానకోకిల పురస్కారాలను అందజేశారు. ఉద్యమాలకు, పోరాటాలకు ఆయువు పట్టయిన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులు, నిధులు, ఇసుక, క్వారీ, బొగ్గు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ, సంపదను ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ కొరకే తమ సంస్థను ఈరోజు ఆవిర్భవించామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ గాయకులకు రచయితలకు ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఉద్యమ గాన కోకిల పురస్కారాన్ని అందించి ఘనంగా సన్మానించి నందుకు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్ కి, సంస్థ ప్రధాన కార్యదర్శి ముక్కెర సంపత్ కి కళాకారులు హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలిపారు.







