
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బస్టాండ్ నుంచి జమ్మికుంట రోడ్డుకు వెళ్లే దారిలో ఆక్రమంగా వేసి ఉన్న డబ్బాను శుక్రవారం మున్సిపల్ అధికారులు జెసిబితో కూల్చివేశారు. బస్టాండ్‌లో 36 మంది చిరు వ్యాపారులు గతంలో జిల్లా కలెక్టర్‌కు, కమిషనర్‌కు సైతం వినతి పత్రం సమర్పించారు. ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్‌కు సైతం వినతి పత్రం సమర్పించారు. జమ్మికుంట రోడ్డు నుంచి బస్టాండ్ లోపలికి వచ్చే రోడ్డును ఆక్రమించుకొని ఓ వ్యక్తి డబ్బాను వేయగా తమ వ్యాపారాలకు ఇబ్బందిగా మారిందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని 36 మంది బస్టాండ్ షట్టర్ల యజమానులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు డబ్బా వేయడంపై విచారణ జరిపి పలువురి అభిప్రాయాలు తీసుకుని అక్రమంగా వేసినట్లు గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బాను కూల్చివేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా డబ్బాలు వేసిన, షాపులను ఏర్పాటు చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







