
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ జులై 13: దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. రహస్య గదిలో స్వామి వారికి అపార సంపదలు, వైజ్రవైఢ్యూర్యాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల రహస్య గది రేపు తెరుచుకోనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో రహస్య గదులను తెరిచిన విధంగానే ఒడిశాలోని పూరి జగన్నాధ ఆలయంలో కూడా రత్నబండాగారాన్ని తెరుస్తారని ప్రచారం కావడంతో దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి నేలమాలికలు తెరవకముందు తిరుపతి తిరుమల దేవస్థానం అత్యంత శ్రీమంతుడిగా దేవుడు వెలిసింది విధితమే. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి ప్రపంచంలోనే మొట్టమొదటి కుబేర దేవాలయముగా విలువగా ఈ ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గదిని తెరిచినట్లయితే మొదటి స్థానానికి వస్తుందా లేదా రెండవ స్థానంలో ఉంటుందా మూడవ స్థానానికే పరిమితం అవుతుందా అనే చర్చ సర్వత్ర కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఏ విషయం అనేది తేట తెల్లం కానున్నది.

