
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ బీజేపీ 25వ బూత్ అధ్యక్షులు చత్తర్ సింగ్ వదిన మీనా కౌర్ నిన్న గుండెపోటుతో మరణించారు. మరియు మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి రొంటాల వైకుంఠం అనారోగ్యంతో మృతి చెందారు. బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు, పట్టణ ఉపాధ్యక్షులు పోతుల సంజీవ్, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు బొరగాల సారయ్య, శక్తి కేంద్ర ఇన్చార్జ్ కొలిపాక వెంకటేష్ తదితరులు వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.







