
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం జూపాక- బొత్తలపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, కౌ ఫౌండేషన్ చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు కాశెట్టి కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తా పండ్ల దుకాణాల ఎదురుగా పలు రకాల మొక్కలు నాటి వాడికి ట్రీ కార్డులు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ బాటసారులకు, ఆటోడ్రైవర్లకు, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంలో రోగులకు సేపును (పండ్లు) పంపిణీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంకు వెళ్లి గర్భిణీలు, బాలింతలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎస్సార్ఎస్పి కెనాల్ వెంట పలు రకాల మొక్కలు నాటారు. కాశెట్టి కుమార్ సామాజిక కార్యకర్తగాక రాజకీయ నాయకుడుగా కూడా ఎంతో మంది ప్రజలకు సుపరిచితుడని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న కాసెట్టి కుమార్ సేవలు అమోఘమైనవి అన్నారు. సామాజిక కార్యకర్త కాశట్టి కుమార్ నిండా నూరేళ్లు జీవించాలని ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో హుజురాబాద్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త నలుపాల వేణుగోపాల్, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




