
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్-జమ్మికుంట పట్టణాలలో ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసి యదేచ్చగా భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుని భ్రూణ హత్యలకు సహకరిస్తున్న వైద్యులను గుర్తించి వారి గుర్తింపును రద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ కి యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్, పర్లపల్లి నాగరాజులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతంలో విచ్చలవిడిగా వెలిసిన ఆసుపత్రులపై, అదేవిధంగా స్కానింగ్ సెంటర్లు ల్యాబ్ లపై చర్యలు తీసుకోవాలన్నారు. పేద ప్రజల వైద్య అవసరాలను ఆసరాగా చేసుకుని స్కానింగ్ లు పరీక్షల పేరిట వేలాది రూపాయలు దండుకుంటూ వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారన్నారు. ఇలాంటి ఆసుపత్రులకు సంబంధించిన వారు మెడికల్ షాప్ లలోనే మందులు తీసుకోవాలని సూచిస్తూ మెడికల్ మాఫియా కొనసాగిస్తున్నారన్నారు. గతంలో సైతం లింగనిర్ధారణ పరీక్షలు చేసి పట్టుబడిన ఆసుపత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. కానుక హాస్పటల్ లను గుర్తించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి సదరు ఆసుపత్రులపై స్కానింగ్ సెంటర్ లపై మెడికల్ షాప్ లపై శాఖా పరమైన చర్యలు తీసుకొవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, కమటం సందీప్ తదితరులు పాల్గొన్నారు.
