
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయ యువజన కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఫై మూడు జిల్లాలకు సంబంధించి ఐదు జోన్లలో యువజన కాంగ్రెస్ కమిటీల ఎన్నికలకు షెడ్యూల్ వెలవడించడం జరిగిందనీ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి షేక్ సాజిద్ అలీ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు. ఇందులో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గస్థాయి కమిటీల ఏర్పాటుకు సభ్యత్వ నమోదు జూలై 9న ప్రారంభించబడి నామినేషన్లు 11 జులై ఉదయం 9 గంటల నుండి 20 జూలై సాయంత్రం 5 గంటల వరకు మరియు అభ్యంతరాలు 12 జులై నుండి 21 జూలై వరకు నామినేషన్ల పరిశీలన 22 జూలై నుండి 26 జూలై వరకు నామినేషన్ల ఖరారు 28 జూలై వరకు మరియు ఎన్నికల కార్యాచరణను అనుసరించి కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పిఆర్ఓతో పాటు జెడ్ఆర్ఓ లను నియమించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 35 సంవత్సరాల లోబడిన యువతి యువకులు తమ ఓటును నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయి యువతకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో భాగంగ కృషి చేయాలని కోరుకుంటున్నన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారా నిర్వహించటం జరుగుతుందనీ, కావున యువతి యువకులు విత్ ఐవైసీ మొబైల్ యాప్ ద్వారా తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.






