
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వైద్యుల శిరీష ముకుంద రెడ్డి మామయ్య రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ముకుంద రెడ్డి తండ్రి మృతికి గల కారణాలు ఆయనను అడిగి తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పలు గ్రామాలలో ఇటీవల వివిధ కారణలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి, ఎస్ పావని వెంకటేష్, సీనియర్ నాయకులు ఇంద్రసేనా రెడ్డి, మాజీ జడ్పిటిసి బడిదం బక్కారెడ్డి, వైస్ ఎంపీపీ బి రమేష్, మాజీ mptc లు, మాజీ సర్పంచ్ లు, BRS నాయకులు, కార్యకర్త తదితరులు ఉన్నారు.








