
స్వర్ణోదయం ప్రతినిధి, ముల్కనూర్ జూలై15: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని స్వామి రామానంద తీర్థ సహకార( S R T) జూనియర్ కళాశాలలో పేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
ఇంటర్నేషనల్ హోమోజియా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ సంస్థ ప్రతినిధులు తిరుమల రుషి, భాష, వంశీకృష్ణలతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఎదులాపురం మొగిలి, అధ్యాపకులు పాల్గొన్నారు.






