
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాధారణ బదిలీల్లో ఆఫీస్ బేరర్స్ పేరుతో తప్పుడు ద్రవ పత్రాలు, ఇస్తున్న. పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్-3194 (ఐఎన్ టియూసీ) సంఘంపై కఠిన చర్యలు తీసుకోని, విజిలేన్స్ ఎంక్వైరీ చెయించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ -హేచ్ 1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కోఠిలోని హేచ్ – 1 యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి ఇష్టమైన స్థానాలలో తిష్ట వేసుకొని కుర్చునే ఉద్యోగులకు రాత్రికి రాత్రే లక్షల రూపాయలు వసూలు చేసుకుని, యూనియన్ ఆఫీస్ బేరర్స్ గా తయారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 80 ద్వారా సాదారణ బదిలీలకు అనుమతించిన నాటి నుండి ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలని డైరెక్టర్ ఆఫ్ హేల్త్, కమీషనర్ కి లేఖ ద్వారా పేర్కొనడం జరిగిందని అన్నారు. ప్రతి క్యాడర్లో నాలుగు సంవత్సరాలు స్టేషన్ సీనియారిటీ పూర్తయిన వారి వివరాలు ఆదే కేడర్లో 40 శాతం ఉద్యోగులను గుర్తించడంలో ఇప్పటివరకు అధికారులకు స్పష్టత లేకపోవడం దురదృష్టకరమన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 2004 సంవత్సరం నుండి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడం లేదని, గడిచిన 20 సంవత్సరాలుగా ఉద్యోగుల హక్కుల రక్షణ కొరకు నోరు మెదపని సంఘం సాధారణ బదిలీలు వచ్చేసరికి తమదే గుర్తింపు సంఘం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు రాష్ట్ర, జిల్లా కమిటీలు ఎన్నికలు ఉంటాయని, నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్ ను అపాయింట్ చేసుకొని సభ్యుల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీలను ఎన్నిక చేయాల్సి ఉంటుందని, ఎన్నిక కాబడిన కమిటీల వివరాలను రాష్ట్ర జిల్లా అధికారులకు, లేబర్ కమిషనర్లకు విధిగా అందజేయాల్సి ఉంటుందని పేర్కోన్నారు. జీవో 80 సాధారణ బదిలీల నోటిఫికేషన్ విడుదలకు ముందు అధికారుల వద్ద సబ్మిట్ చేయబడిన రాష్ట్ర ,జిల్లా స్థాయి ఆఫీసు బేరర్స్ మాత్రమే ప్రివిలైజేషన్ పొందడానికి అర్హులన్నారు. ఆఫీస్ బేరర్స్ గా ప్రివిలైజేషన్ పొందగోరిన ఉద్యోగుల లిస్టును ముందు రోజు డిస్ ప్లే చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు విరుద్ధంగా అక్రమ మార్గంలో ఆఫీస్ బేరర్స్ సర్టిఫికెట్స్ రాసిన సంఘం ప్రివలైజేషన్ పొందిన ఉద్యోగులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు ద్రవ పత్రాలు, ఇస్తూ, ఆఫీస్ బేరర్స్ సర్టిఫికెట్స్ లో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని సాధారణ ఉద్యోగి బదిలీ హక్కును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జి రాజశేఖర్, ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహలా, నాయకులు రాజు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.






