
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
తప్పెట దరువులకు దూలా, అసోన్దూలా అంటూ అలాయి చుట్టు యువకులు చిందులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా గ్రామాలలోను, పల్లెలలోను సాగే పీర్ల పండుగ ఉత్సవాలు హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో కొనసాగింది. పడాల శ్రీనివాస్, రాముల మల్లయ్య, బైరి సత్తి నేతృతంలో పీర్ల పండుగ వచ్చిందంటే పది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సంబరంగా హిందూ, ముస్లిం అనే మత భావం లేకుండా అందరు కలిసి సంబరాలు జరుపుకోవడం అనవాయితీ. అయితే మండలంలో తీవ్ర కరువు పరిస్థితుల మూలంగా గ్రామాలలోని ప్రజలు వలసలు వెళ్లారు. కాగా మొహరం పండుగకు తమ మొక్కబడులు తీర్చుకోవడానికి చాలా మంది వలసల నుండి తమ గ్రామాలకు తిరిగి రావడంతో ఈపీర్ల పండుగ వేడుకలు ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. పీర్ల పండుగ సందర్భంగా గ్రామాలలోని యువకులు వివిధ రకాలైన వేషాలను ధరించి గ్రామంలో తిరుగుతూ అందరిని సంతోషపరుస్తారు. అమావాస్య తర్వాత చంద్రోదయం కాగానే ఆ రోజు నుండే మసీదులో పీర్లను నిలబెడతారు. మొహర్రం వరకు ఈ ఉత్సవాలు గ్రామాలలో జరుగుతూనే ఉంటాయి. ఈప్రాంతంలోని ప్రజలకు పీర్ల పండుగ సందర్భంగా పీర్లకు మొక్కుబడులు చెల్లించుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయనే భావంతో రకరకాలైన మొక్కుబడులను చెల్లిస్తుంటారు. చాలా గ్రామాలలో పీర్ల పండుగను ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో పీరీల నిర్వాహకులు బైరి సారయ్య, గట్టయ్య, గాలిబు అంజి, నాగరాజు, బోనగిరి సమ్మయ్య , మహేష్, బోనగిరి నరేష్, రాముల సమ్మయ్య, రాముల దేవయ్య, తిరుపతి, చుంచు సదానందం, రాజయ్య, రాముల సమ్మయ్య, పటాల శ్రీకాంత్, వెంకటేష్, చుంచు రవీందర్, ఇల్లందుల అజయ్, వేల్పు కొండ విజయ్, కోటి, బైరి స్వామి, కుమారస్వామి, బుర్ర తిరుపతి, శ్రీనివాస్, ఆదర్శ్, చుంచు రాజు, చుంచు పెద్ద రాజు, చిన్న రాజు, అనిల్, బుర్ర రంజిత్ వెళ్లకుండా అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


