రైతన్నలకు వెన్నుదన్నుగా ప్రజా ప్రభుత్వం..రైతును రాజుగా చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం!-ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మి రైతులు అయోమయానికి గురి కావొద్దు..టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకరం చుట్టిందనీ, రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఒక చారిత్రక నిర్ణయం నేరుగా అన్నదాతల ఖాతాల్లో రైతు రుణమాఫీ నగదు జమ చేయడం గొప్ప నిర్ణయమని టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ పేర్కొన్నారు. బుధవారం హుజరాబాద్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారి (బిఎన్ఓ) గా నియమించిందన్నారు. ఈ నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఎన్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి రుణమాఫీ పై ఉన్న శ్రద్ధకు నిదర్శనం అన్నారు. అంతేకాక ప్రతిపక్షాలు చేసే పిచ్చి ఆరోపణలు రైతులను అయోమయానికి గురిచేస్తూ అనుమానాలను కలిగిస్తే నివృత్తి చేయడానికి మరియు రైతుల సందేహాలు ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసి రైతులు తమ ఇబ్బందులను ఐటి పోర్టల్ లేదా మండల స్థాయిలో ఏర్పాటు చేసే సహాయ కేంద్రాల వద్ద తెలిపే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ప్రతి అభ్యర్థనను 30 రోజుల్లో పరిష్కరించి దరఖాస్తుదారుడికి తెలియజేస్తారనీ తెలిపారు. ముఖ్యంగా రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదనీ, రైతులను అయోమయానికి గురిచేసి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ వర్తిస్తుందనీ, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలిపారన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కొండలకు గుట్టలకు బీడు భూములకు, పెట్టుబడి దారులకు, సంపన్నులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇవ్వకుండా శ్రమను నమ్ముకుని దేశానికి దశదిశగా అనునిత్యం శ్రమిస్తున్న రైతులకు రుణమాఫీ ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. రైతులు ఎవ్వరు అధైర్య పడొద్దు అని, మాట తప్పని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా అని దొంత రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి బత్తిని రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి బాబు, యువజన కాంగ్రెస్ నాయకులు జంగ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!