
స్వర్ణోదయం ప్రతినిధి, కాళ్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్టులందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరిగిన ఫామ్ ఆయిల్ రైతుల సభకు హాజరైన మంత్రికి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల సర్వీసులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని, స్టేట్ అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా, ఇతర జిల్లాలో ప్రయాణించేందుకు 1/3వ వంతు చార్జీలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే అక్రిడేషన్ కార్డులు గల జర్నలిస్టులందరికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బాలె శివప్రసాద్, సోన్నాయి టెంకం చంద్రమౌళి, రావి కోటేశ్వర్లు, ఆర్ మృత్యుంజయం, గుడ్ల శ్రీనివాస్, అనంతరెడ్డి, శ్రీమంతుల కొండల్, రావి మధుకర్, వీరగోని రమేష్, మేకల మల్లేష్, సదానందం, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






