
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం మడిపెళ్లి గ్రామానికి చెందిన గీతా కార్మికుడు మాచర్ల నాగేశ్వర్ గౌడ్ తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందగా అతని కుటుంబ సభ్యులను సర్వాయి పాపన్నగౌడ సంఘం మోకు దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్ పరామర్శించి ప్రభుత్వ పరంగా రావలసిన ఎక్సగ్రేషియా ఇప్పించటానికి కృషి చేస్తానని తెలిపారు. అదే గ్రామంలో గాజుల పర్శరాములు అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందగా అతని భౌతిక దేహానికి నివాళులు హర్పించారు. అదేవిధంగా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన మడ్డి జగ్గయ్యగౌడ్ తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాల పాలయి మంచానికి పరిమితం అవ్వగా అతన్ని పరామర్శించి ఎక్సగ్రేషియా ఇప్పించటానికి కృషి చేస్తానని హామీచ్చారు. ఈ సందర్భముగా జక్కే వీరస్వామిగౌడ్ మాట్లాడుతు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం గౌడ్ త్వరగా కాటమయ్య రక్షణ కవచాలు అందరు గీతా కార్మికులకు త్వరలో అందించి గీతా కార్మికుల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా గీతా కార్మిక కుటుంబాలకు తక్షణ సహాయం కింద దహన సంస్కారాలకు, హాస్పటల్ ఖర్చులకు తాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే సహాయం త్వరగా అందించి కుటుంబాలను ఆదుకోవాలని బుర్ర వెంకటేశం ఐఏఎస్ కి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి గణపతిరాజ్ గౌడ్, జిల్లా గౌడ సంగం నాయకులు పల్లెర్ల కొమురయ్య గౌడ్, గ్రామాల గౌడ సంఘము నాయకులు బోనాగని రమేష్ గౌడ్, మడ్డి మహేష్ గౌడ్ పలువురు గౌడ సోదరులు పాల్గొన్నారు.







