మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఓ చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్ వైద్య ఖర్చులకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ సహకారం అందించి తన ఉదారతను చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన శ్రీనివాస్ – స్వప్న దంపతుల కుమార్తె సహస్త్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఆ చిన్నారికి బ్రెయిన్ ఆపరేషన్ చేయించవలసి ఉండగా ఆర్థికంగా లేని ఆ దంపతులు మదన పడుతుంటే వారి బాధలు తెలుసుకున్న ప్రణవ్ ముందుకు వచ్చి చిన్నారిని ఆదుకునే ఉద్దేశంతో వారికి హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించడానికి రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసిని తెప్పించారు. శుక్రవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సహస్ర తల్లిదండ్రులకు అందించారు. కాగా తమ పాప బ్రెయిన్ ఆపరేషన్ కు సహకరించిన ప్రణవ్ మేలును మరువలేమని వారు కన్నీటి పర్యంతంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, పీ మధుకర్ రెడ్డి, యేముల పుష్పలత తదితరులు పాల్గొన్నారు.