మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :
ప్రజలు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోనే ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిరక్షణకు సహకరించాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక పేర్కొన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ లోని 1వ, 28వ వార్డులలో డ్రై డేను పురస్కరించుకొని ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గం, అధికారులు వార్డులను పరిశీలించి స్థానిక ప్రజలకు పలు సూచనలు చేశారు. వార్డు ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. మురికి కాలువలలో చెత్తా చెదారము వేయకుండా ప్రతిరోజూ ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య తోపుడు బండ్ల వారికి చెత్తను అంధించుటకు, దోమలు వృద్ధి చెందకుండా ఉండుటకు గాను ఇంటి పరిసరాలలో వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన వంతు కర్తవ్యాన్ని మనము నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘము కమిషనర్ సల్వాది సమ్మయ్య, హెల్త్ డిపార్టుమెంట్ జరీనా, 1వ వార్డు అధికారి రమ, 28వ వార్డు అధికారి రజిత, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఏం కిషన్ రావు, సానిటరీ జవాన్లు తూముల కుమారస్వామి, ఆరెల్లి రమేష్, ఆశా వర్కర్లు, మెప్మా RPలు రమాదేవి, స్వరూప ఇతర సిబ్బంది పాల్గొన్నారు.