మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు జరుగుతున్న సాదారణ బదిలీల్లో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజీస్టుగా పనిచేస్తూన్న డాక్టర్ వాణిలత కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి బదిలీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ వెంకళ్ రావ్ నగర్ లో నిర్వహించిన బదిలీ కౌన్సీలింగ్ కు ఆమే హాజరయ్యారు. 2015 సంవత్సరం నుండి ఆమే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. శుక్రవారం బదిలీ ఆర్డర్స్ స్వీకరించినట్లు తెలిసింది. నార్మల్ డెలివరీలు చెయ్యడంలో ఆమేకు ఆమే సాటి అని మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోరకు వచ్చే పేద, మధ్యతరగతి వారి పట్ల ఆమే ఎంతో కరుణ, జాలీ చూపించేదని పలువురు సిబ్బంది కోనియాడుతున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో పేరుగాంచిన గైనకాలజీస్టు ఎవరంటే డాక్టర్ వాణిలత అని చెబుతారు. హుజరాబాద్ ఏరియా ఆసుపత్రి కాకముందు నుండి కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన ఆమె ఇదే ఆస్పత్రిలో రెగ్యులరైజ్ అయ్యాక విధులు నిర్వహిస్తున్నారు. ఆమే బదిలీతో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ప్రసవాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది పేర్కోంటున్నారు. కాగా ఆమే స్థానంలో కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ నిశ్చలరెడ్డి ఆమే స్థానంలో రానున్నట్లు తెలిసింది.