బడ్జెట్ లో కార్మికుల కోసం అద్దె గృహాలు: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్..యువతకు ఉద్యోగాలు

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూ ఢిల్లీ, జులై 23: పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. 500 పెద్ద కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామ న్నారు. వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు, 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృ ద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్లు నిర్మిస్తాం అని అన్నారు..

బడ్జెట్‌లో ఊరట
తగ్గనున్న బంగారం, వెండి ధరలు
సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
ఎక్స్‌రే మెషీన్లపై జీఎస్టీ తగ్గింపు
25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

కొత్త ట్యాక్స్‌ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు

కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను

ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెరిగిన పన్నుశాతం
ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై 25 శాతం పెరిగిన పన్ను

నిరుద్యోగుల కోసం మూడు పథకాలు
• ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
• ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
• సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు
• గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు
• 210 లక్షల మంది యువతకు లబ్ధి
• ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
• వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
• వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
• దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
• అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
• మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!