మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈ రోజుల్లో రోడ్డుపై వెళ్తుంటే పది రూపాయలు దొరికితే తీసి జేబులో పెట్టుకునే రోజుల్లో రూ.2 లక్షల రూపాయలు దొరికిన ఎంతో నీతి నిజాయితీతో పరుల సొమ్ము పాము వంటిదని భావించి పోలీసులకు అప్పగించి తమ నిజాయితీని చాటుకున్న ఇద్దరు వ్యక్తుల ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం పరకాల నుండి హుజూరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్ లో రూ. 2 లక్షలు నగదు లభ్యం కాగా జిల్లాలోని బెజ్జంకి కి చెందిన ఇలా సాగరం ప్రమోద్, రేగొండకు చెందిన మోర ఉదయ్ కుమార్ లు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పరకాల నుండి హుజూరాబాద్ వస్తున్న బస్ లో ప్రమోద్, ఉదయ్ కుమార్ వస్తుండగా బస్సులో సీటు పైన 2 లక్షలు నగదు ఉన్న బ్యాగును చూసి తెరిచి చూడగా అందులో డబ్బులు కనిపించాయి. వెంటనే ఆ నగదును బస్టాండ్ లోని స్టేషన్ మాస్టర్ తెలిపి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై హైమద్ అలీ కి అప్పగించారు. నగదు రెండు లక్షల రూపాయలు దొరికిన దురాపేక్షతో చూడకుండా ఎంతో నీతి నిజాయితీతో సదరు నగదును తీసుకువెళ్లి పోలీసు స్టేషన్ లో అప్పగించిన విలసాగరం ప్రమోద్, మొర ఉదయ్ కుమార్ లను పోలీస్ అధికారులతో పాటు పలువురు ప్రజలు అభినందించారు. ఆర్టీసీ బస్సు ఎక్కిన వ్యక్తుల టికెట్ల ఆధారంగా, సీసీ కెమెరాల ఆధారంగా సమగ్ర విచారణ జరిపి నిజమైన బాధితులు ఉంటే వారికి తిరిగి సదరు నగదును అందజేస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.