Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా వి రవీంద్రనాథ్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. హుజురాబాద్ ఇన్చార్జి డిపో మేనేజర్ గా గత కొన్ని నేలాలుగా హుస్నాబాద్ డిఎం వెంకటేశ్వర్లు కొనసాగుతుండగా, పూర్తిస్థాయి డిపో మేనేజర్ గా మంచి ర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గా పనిచేస్తున్న వి రవీంద్రనాథ్ ను హుజురాబాద్ డిపో మేనేజర్ గా బదిలీ చేయగా ఆయన ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఆర్టీసీ డిపోను లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తానని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు అన్ని వర్గాల వారిని కలుపుకొని డిపో అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. హుజురాబాద్ డిపో నుండి ఏ ఏ ప్రాంతాలకు బస్సు సౌకర్యం అవసరం ఉంటుందో ఉద్యోగులను, కార్మికులను, నాయకులను, ప్రజలను అడిగి తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంతకుముందు ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన ప్రతి చోటికి బస్సును తిప్పేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ ప్రగతి కోసం అంకితభావంతో పనిచేసీ డిపోను రీజియన్ లోనే కాక రాష్ట్రంలోనే ముందువరుసలో నిలపాలని డిఎం సూచించారు. కాగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రవీంద్రనాథ్ ను ఆర్టీసీ ఏడీఎం సత్యనారాయణ, టిఐ2 ఎల్ సారయ్య, ఉద్యోగులు టిఎస్ సింగ్, రాములు, అశోక్, రెడ్డి, ఉపేందర్, కిషోర్, రవీందర్, తదితర సిబ్బంది ఆయనను కలిసి పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.







