
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జులై 26: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిద్ధార్థ నగర్ కాలనిలో గోరింటాకు వేడుకను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు అతి పవిత్రంగా భావించే ఆషాఢమసాన్నీ పురస్కరించుకొని కాలనిలోని మహిళలందరు ఒక్కచోట చేరి ఒకరికొకరు తమ చేతులకి గోరింటాకుతో అందంగా అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సతీమణి సాగి వనజ మాట్లాడుతూ..పురాణాల ప్రకారం గోరింటాకుకు గౌరి దేవికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. నాటి నుండి నేటి వరకు మహిళలు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. గోరింటాకు కేవలం మహిళలకు అందానికే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకురుస్తుందని వారు అన్నారు. ప్రత్యేకించి మహిళల సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారని, భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని వనజ అన్నారు. ఈ కార్యక్రమంలో సాగి వనజతో పాటు మాడ సమతరెడ్డి, పెద్ది ప్రసూనారెడ్డి, సాగి ప్రియాంక, మాడ భాగ్యలక్ష్మి, కేతిరి ప్రసన్నరెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.







