
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సబ్ జైల్ ఆవరణలో GK రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన సబ్ జైలర్ నాంపల్లి దేవేందర్ నీ పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఖైదీలను ప్రేమ, దయతో చూసి, వారు సాధారణ పౌరులుగా మారే విధంగా, వారి అభిమానము పొందేటట్లు సబ్ జైలు అధికారులు తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో GK రైతు మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, కంకణాల జనార్దన్ రెడ్డి, సభ్యులు ఎస్ అనురాధ, బొంగోని వెంకటయ్య, మండల వీరస్వామి, కోటోజు జ్యోతి, సంపత్ రెడ్డి, దోమల సత్యం తదితరులు పాల్గొన్నారు.
