
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న పరిసరాల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు గుర్తించాలని డ్రైడే సందర్భంగా పలువురు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో డ్రైడే సందర్భంగా ప్రజలకు పరిశుభ్రతపై అధికారులు అవగాహన కల్పించారు. మురికి కాలువలలో చెత్తా చెదారము వేయకుండా ప్రతిరోజూ ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య తోపుడు బండ్ల వారికి చెత్తను అంధించుటకు, దోమలు వృద్ధి చెందకుండా ఉండుటకు గాను ఇంటి పరిసరాలలో వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘo 2వ వార్డు కౌన్సిలర్ బర్మావత్ యాదగిరినాయక్, మెడికల్ హెల్త్ అసిస్టెంట్ కే సత్యం, 2వ వార్డు అధికారి ఏం కొమురయ్య, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఏం కిషన్ రావు, సానిటరీ జవాన్ తూముల కుమారస్వామి, ఆశా వర్కర్లు తిరుపతమ్మ , మెప్మా RPలు, సిబ్బంది పాల్గొన్నారు.







