మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: దేశ సరిహద్దులను దాటుకొని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యాన్ని భారత ఆర్మీ తిప్పికొట్టిన ప్రదేశం, ప్రతి భారతీయుడులోనూ చెరగని ముద్ర వేసిన పేరు కార్గిల్ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో శుక్రవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి కార్గిల్ అమరవీరులకు బిజెపి జిల్లా పక్షాన సెల్యూట్ చేస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా కార్గిల్‌ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్‌పై ఓ మినీ యుద్ధమే చేసింది భారత్ అన్నారు. ఈ క్రమంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారని తెలిపారు. సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన కార్గిల్ ను స్వాధీనం చేసుకోవడానికి జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటుకుని పాక్ సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించారన్నారు. కార్గిల్ చొరబాటును తొలిసారిగా 1999 మేలో గుర్తించారని, ఆ వెంటనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగిందన్నారు. అత్యంత సంక్లిష్టమైన పర్వత పంక్తుల మధ్య రెండున్నర నెలల పాటు పాక్‌తో భారతదేశము యుద్ధాన్ని కొనసాగించిందని, దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టిందన్నారు. పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమికొట్టింది. ఆపరేషన్ విజయ్‌లో భాగంగా టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని. 1999 జులై 26వ తేదీన కార్గిల్ కు పాక్ చెర నుంచి విముక్తి కల్పించిందన్నారు.. అందుకే ప్రతి ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, జిల్లా అధికార ప్రతినిధి జెల్ల సుధాకర్, కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు మెరుగు రాజిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తుర్పాటి రాజు, పట్టణ ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, సబ్బని రమేష్, అంకటి వాసు, తిప్పబత్తిని రాజు, యాళ్ల సంజీవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తుముల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, శ్రీకాంత్, ఎస్సి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మోలుగురి నగేష్, శక్తి కేంద్ర ఇన్చార్జ్ కొలిపాక వెంకటేష్, భూత్ అధ్యక్షులు గుండేటి భార్గవ్, క్యాస వెంకటేష్, సమ్మయ్య, నాగరాజు, గుర్రం సంతోష్, విజయ్, పర్థం రాము, గంధం మధు, భూతం అంజన్న, అనిల్, సాయి, అరవింద్, విజయ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.