
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఈ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కుల గణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం దీనిని పట్టించుకోకుండా హడావిడి ప్రకటన చేయడం పట్ల పలు విమర్శలకు దారి తీస్తుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు పలు శాఖల మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.






