
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మొగిలి బొందయ్య (70) రోజువారి లాగానే తన గొర్ల మందను తీసుకొని గ్రామ శివారులో గొర్రెలను కాస్తుండగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక గొర్రె బావిలో పడగా ఆ గొర్రెను కాపాడేందుకు బొందయ్య బావిలో దిగగా కాలు జా రి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మృతుని కొడుకు మొగిలి ఓదెలు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి రాజేష్ తెలిపారు.






