Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యా శాఖకు రూ. 21,292 కోట్లు కేటాయించడం పట్ల కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్ సంతోషం హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వo విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం విద్యాదికులకు మరింత సంతోషం కలిగిందన్నారు. ఈ కేటాయింపుల్లో యూనివర్సిటీలలో మౌలిక వసతుల కల్పన కోసం 500 కోట్లు కేటాయించారన్నారు. వాటిలో తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తరువాత రెండవ పెద్ద యూనివర్సిటీగా ఉండి దక్షిణాది తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు కల్పవృక్షంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీకి 135 కోట్లు కేటాయించటం హర్షణీయమని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కాకతీయ యూనివర్సిటీకి కేవలం 96 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం వల్ల యూనివర్సిటీ అధికారులు ఈ నిధులను యూనివర్శిటీలో మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థులకు మెరుగైన ఆధునిక విద్య వసతులను కల్పించడానికి వినియోగించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మరిన్ని నిధులను సమీకరించి వాటిని యూనివర్సిటీ అభివృద్ధికి వినియోగించాలని డాక్టర్ శేఖర్ అభిప్రాయపడ్డారు.






