Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హుజురాబాద్ యూనిట్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం ఆదివారం స్థానిక మండల పరిషత్తు సమావేశ మందిరములో సంఘ అధ్యక్షుడు మహ్మద్ ఉస్మాన్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ విష్ణుదాస్ గోపాల్ రావు నివేదిక మరియు ఆర్థిక నివేదికలు, కోశాధికారి కోయల్ కార్ దుర్గాజీ చదివి వినిపించగా పెన్షనర్స్ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. 82మంది రిటైర్డ్ ఉద్యోగులు సమావేశానికి హాజరయ్యరన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. కొన్ని ముఖ్యమైన తీర్మానములు అమోదించారు. ప్రభుత్వం ఇచ్చే 5 డీఎలు,పీఆర్సీ, హెల్త్ కార్డులు సత్వరమే ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మహ్మద్ ఉస్మాన్ పాషాతో పాటు ప్రధాన కార్యదర్శి DR విష్ణుదాస్ గోపాల్ రావు, కోశాధికారి కోయల్ కార్ దుర్గజీ, జిల్లా శాఖ కార్యదర్శి కొంరవెల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు P గణపతిరెడ్డి, గాజుల చారుదత్తు, ఆర్గనైజేయింగ్ కార్యదర్శి మౌటం రవిందర్ ఎర్ర కాంతమ్మ, ప్రచార కార్యదర్శి గంజి జయవర్ధన్, జిల్లా కౌన్యిలర్స్ పి లక్ష్శినారయణ, కాసర్ల శ్రీహరి సభ్యులు పాల్గోన్నారు.








