
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తమ చిన్ననాటి అనుభవాలను స్మరించుకుంటూ, నాటి ఉపాధ్యాయులను సన్మానిస్తూ ఆనందోత్సాహాల మధ్య పూర్వ విద్యార్థులు సమావేశాన్ని నిర్వహించుకున్నారు.
***జూనియర్ కళాశాల విద్యార్థులు
హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1986 88 సంవత్సరంలో ఇంటర్ సీఈసీ చదివిన విద్యార్థిని విద్యార్థులు ఆదివారం మధువని గార్డెన్ లో సమావేశoజరిగింది. ఈ సందర్భంగా తమ ఉపాధ్యాయులను సత్కరించి వారి బోధనల వల్లనే తాము ఉన్నత స్థాయికి ఎదిగామని పలువురు విద్యార్థులు వివరించారు. చదువుకున్న సమయంలో తాము చేసిన పనులు, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చందుపట్ల వేణు, సదానందం, కొమురవెల్లి విజయ్, ఇంజమూర్ వేణు, మౌటం సదానందం, గంగిశెట్టి సంపత్, రవీందర్రావు, లెక్చరర్ శంకర్రావు నల్ల మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
–ఉషోదయ విద్యార్థుల సమావేశం.

హుజురాబాద్ ఉషోదయ స్కూల్ 2002-03 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా గురువులను సత్కరించి, పలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు మండల వీరస్వామి, ఉపాధ్యాయులు చిలుకమారి సత్యరాజ్, గునిగంటి శ్రీనివాస్, మండల సత్యనారాయణ, శ్రీనివాస్ చారి, రేణుక, ఫరీదా భాను, సంపత్, కనకం శ్రీనివాస్, సురేష్, సృజన్, రమాదేవి, సృజన, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
–ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల సమ్మేళనం..
హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 2004-05 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సాయి రూప గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నల్ల మహేందర్, గిరిజా దేవి, భూపతి లక్ష్మి, చిమ్ముల రాజేందర్, రంగు దామోదరా చారి, బొంగోని వేణు, విద్యార్థులు మిడిదొడ్డి రాజు, తిప్పారపు నాగరాజు, బొడ్డు అనిల్, సిద్ధమల్ల వెంకటేష్, ఆలకుంట ఎల్లయ్య, జెట్టి నరేష్, నవీన్, కనకం శ్రీలత, కిరణ్మయి, బుర్ర కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు






