
స్వర్ణోదయం ప్రతినిధి, చిగురుమామిడి, జూలై 29,2024:
బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా చిగురుమామిడి మండలం, రేకొండ గ్రామానికి చెందిన పిట్టల రజినీకాంత్ ను జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మదాసు సంజీవ్ ను నియామకం చేశారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్, జిల్లా అధ్యక్షులు నాగుల కనుకయ్య గౌడ్ ఆదేశానుసారం పదవి భాద్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పిట్టల రజినీకాంత్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వములో యువజన విభాగం పటిష్టత కోసం, బీసీ కులాల సమగ్రాభివృద్ధి కోసం పాటు పడుతానన్నారు. ఈ నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్, విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, యువజన సంఘం ఉపాధ్యక్షులు బోయిని ప్రశాంత్, శీలం అజయ్, యువజన నగర కార్యదర్శి శివ తదితర బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు.







