
స్వర్ణోదయం ప్రతినిధి, వీణవంక: ఉన్న ఊరు కన్న తల్లీ ఆన్న సామెత అందిరికి తెలిసిందే. ఉన్న ఊరు మీద మమకారంతో గ్రామములో పలు మంచి పనులు చేస్తున్నాడు వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామానికి చెందిన మద్ధుల ప్రశాంత్. ఇటీవల వరసగా కురుస్తున్న వర్షాలకు వీణవంక మండలంలోని లస్మక్కపల్లి ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. నిత్యం రాకపోకలు సాగించే ఈ దారి పరిస్థితి చూసిన ఆ గ్రామానికి చెందిన మద్దుల ప్రశాంత్ అనే యువకుడు తన స్వంత ఖర్చుతో రహదారికి మరమ్మత్తులు చెపించాడు. రహదారి పూర్తిగా బురదమయం కావడంతో తాత్కాలికంగా మొరం పోసి రాకపోకలు సాగేలాగా చేశాడు. ఈ దారి వెంట నడవడానికే ఇబ్బంది ఉన్న సమయంలో యువకుడు ఇలాంటి మంచి పని చేయడం స్థానికులతో పాటు పలువురు అభినందిస్తున్నారు. గతంలో గ్రామంలో రోడ్ కు ఇరువైపులా పెరిగిన తుమ్మచెట్లను జెసిబితో తొలగించి అటుగా వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి మంచి పనులు చేసి మరింత ముందుకు పోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రశాంత్ ను పలువురు అభినందించారు.








